జాగ్రత్త పడండి! తెలుసుకోండి!

మన భారతదేశంలో వ్యవసాయక దేశం నూటికి 60% నుండి 70% వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రసాయనిక ఎరువుల వాడకం, క్రిమిసంహారకాల వాడకం విపరీతంగా పెరుగుచున్నది. వ్యవసాయక గణాంకాల ప్రకారం 30-40 సం.ల క్రితం ఒక హెక్టారుకు సుమారు 30 కిలోల రసాయనాలు వాడేవారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఒక హెక్టారుకు సుమారుగా 114 నుంచి 120 కిలోల రసాయనాల వినియోగం జరుగుచున్నది.

రసాయనాల వల్ల అధిక రసాయనాల వాడకం వల్ల రైతులకు పొలంలో మేలు చేసే మిత్రజీవి, మిత్ర క్రిములు కూడా శత్రు క్రిములతో పాటు అంతమొందుచున్నాయి. అదే విధంగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందివ్వవలసిన ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలగునవి కూడా విషపూరితమై తద్వారా మానవ జీవితాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది.

చిన్నవయసులోనే బి.పి, షుగర్, నరాల బలహీనత, వంద్యత్వాన్ని, వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులను కలుగజేస్తున్నాయి. ప్రస్తుత వ్యవసాయక రంగంలో ఈ “పెస్టిసైడ్స్’, ఇన్సెక్టిసైడ్స్, ల వినియోగం సుమారు 2 కోట్లు మెట్రిక్ టన్నుల వినియోగం జరుగుతున్నది, మనదేశంలో తయారయ్యే ఈ రసాయన ఉత్పత్తులే చాలక విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసిన పరిస్థుతులు నెలకొన్నాయి.

ఇది పూర్తిగా భారతదేశ ఆర్ధిక వ్యవస్థపై పెనుభారాన్ని కలిగిస్తున్నాయి. 20-25 సం.లకు పూర్వం నుంచి 56 దేశాలలో డి.డి.టి పూర్తిగా తయారు చేయడం, వినియోగించడం నిషేధించబడింది., కాని మన భారతదేశంలో డి.డి.టి తో పాటు ‘మేలథియన్ ‘ , ‘బెంజీన్’, ‘హెక్సాక్లోరైడ్’ ,’ క్లోరోఫైరిఫాస్’,’ లెండిన్’, ‘మొనోక్రోటోఫాక్’, మొదలగు 786 రాసాయనాలు ‘పెస్టిసైడ్ ‘ , 216 రకాల ఇన్సెక్టిసైడ్ ‘ మొత్తం 1000 కి పైగా విషాలు వేరు వేరు పేర్లతో అమ్ముడుపోతున్నాయి. పై పేర్కొన్న వివిధ రకాల విషాలు ఏ ఏ దేశాల కంపెనీల ద్వారా ఉత్పత్తి చేయబడుతున్నాయో ఆయాదేశాలలో ఉత్పత్తి చేయడం కాని , వినియోగించడంకాని నిషేధించడం జరిగింది. కాని మన భారతదేశంలో ఈ స్వదేశి , విదేశీ కంపెనీలు కొట్లలో వ్యాపారం స్వేచ్చగా జరుపుకుంటూ మన గాలినీ ,మట్టినీ, జలాలను విషపూరితం చేస్తున్నాయి.

గత 40 సం.రాలుగా జరిగిన పరిశోధనల తరువాత వివిధ దేశాల శాస్త్రజ్ఞులందరు ముక్తకంఠంతో తేల్చిచెప్పిన విషయం ఏమిటంటే మన రైతులు వినియోగించే క్రిమిసంహారకాలలో పురుగుమందులలో 2% తమకు నిర్దేశించిన లక్ష్యానికి, 98% వాతావరణ కాలుష్యానికి మానవ జీవితాన్ని తీవ్ర అనారోగ్యానికి హేతువుగా పేర్కొనడం జరిగింది. ఈ 100 లీటర్ల మోతాదు విషంలో 2 లీటర్ల విషం పురుగులను చంపగా 98 లీటర్ల విషం మట్టిని, గాలినీ, వాతావరణాన్ని, వాననీటి ద్వారా నదీజలాలను కలుషితం చేస్తుంది.

“అతితక్కువ పెట్టుబడితో వ్యవసాయం చేయడం ” విషరహిత ఆహారాన్ని పండించడం స్వాభావికంగా లభించే గోమూత్రం, పేడ, వేప, తులసి, బిల్వపత్రి, ఉమ్మెత్త మొదలగు ఆకులతో తయారుచేయబడిన “బీజామృతం”, “జీవామృతం”, “కీటకనివారిణి “, “అగ్నస్త్రం”, “నీమాస్త్రం”, మొదలైన సేంద్రియ పద్దతుల ద్వారా సక్రమమైన నీటి యాజమాన్య పద్దతుల ద్వారా నూతన వ్యవసాయ పద్దతుల ద్వారా మాచే పండించబడుతున్న ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ ధరల కంటే అతితక్కువ ధరలకు “రైతు నుంచి వినియోగదారునికి నేరుగా ” అందించాలనే ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రతిఒక్కరు మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని ఆసిస్తూ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This is a demo store for testing purposes — no orders shall be fulfilled. Dismiss